నియమించిన జిల్లా కలెక్టర్
నేటి నుంచి అమలులోకి ‘ప్రత్యేక’ పాలన
ఉమ్మడి జిల్లా పరిషత్ పాలనకు నేటితో తెర
నంద్యాల ఎంఆర్‌సీ భవనంలో నూతన జెడ్పీ కార్యాలయం
ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు
స్థానిక ఎన్నికల నిర్వహణకు క్షేత్ర స్థాయిలో పూర్తయిన ప్రక్రియ
ఐదు రోజులు బ్యాంకుల బంద్
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకులు రెండు రోజుల సెలవు, మూడు రోజుల సమ్మె వల్ల బంద్ కానుండ టంతో నగదు సమస్య ఏర్పడనుంది. ఈ నెల 26వ తేదీ 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు 5 రోజుల పని విధానాన్ని తీసుకురావాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు అన్ని బ్యాంకులు సమ్మె పాటిస్తున్నాయి. ఈ లెక్కన మొత్తం ఐదు రోజులు బ్యాంకులు మూతపడనుండ టంతో లావాదేవీలు స్తంభించే ప్రమాదం ఏర్పడింది. అక్టోబర్ 1న జరిగే పింఛన్ల పంపిణీకి సైతం బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుంది.
ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి వరుసగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయకపోతే నగదు సమస్య ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన ఆర్‌బీఐ ఈ నెల 27న ఆదివారం సాధారణ పని వేళల ప్రకారం బ్యాంకులు, కరెన్సీ చెస్ట్‌లు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చింది. సెలవులు, సమ్మె వల్ల బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యమైన బ్యాంకు శాఖలు నగదు పంపిణీ కేంద్రాల్లో ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా నగదు అందుబాటులో ఉంచాలి.
ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలన దాదాపు కూటమి నేతల చేతుల్లోకి వెళ్లింది. తాజాగా మండల పరిషత్ అధ్యక్షుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో మండల పాలన కూడా కూటమి నేత ల గుప్పిట్లోకి పోనుంది. మండలానికి ప్రత్యేకాధికారి ఉన్నా అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో ఎమ్మెల్యే/ఇన్‌చార్జీలు చెప్పిన వాటికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాల అమలులో నూ కేవలం అధికార పార్టీకి సంబంధించిన వారికే ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పారదర్శకంగా ఆయా పథకాలను అర్హులైన వారందరికీ అందించే విషయంలో ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు కొంత మేర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది.
కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని మండలాల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. మండల పరిషత్ అధ్యక్షుల పదవీ కాలం ఈ నెల 23వ తేదీతో ముగిసిన దృష్ట్యా ఆయా మండల పరిషత్‌లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా స్థాయి అధికారులు, ఆర్‌డీఓ, డీడీలతో పాటు ఎంపీడీఓ కంటే పైస్థాయి అధికారులను మండల ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఈ నేఫథ్యంలోనే నేటి నుంచి మండలాల పాలన ప్రత్యేకాధికారుల చేతుల మీదుగా సాగనుంది. కొత్తగా ఏర్పడిన ఆదోని –2 మండలంతో కలిపి జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా కొనసాగుతున్న అధికారులనే దాదాపు ప్రత్యేకాధికారులుగా నియమించారు.
ముగిసిన ఉమ్మడి పాలన
జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 24తో(నేటితో ) ముగియనున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ పాలనకు తెర పడనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాగా నంద్యాల ఏర్పడిన దృష్ట్యా ఈ నెల 25వ తేదీ నుంచి నంద్యాలలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలోని ఎంఆర్‌సీ భవనంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎంఆర్‌సీ భవనంలో జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓలకు చాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలోని పై అంతస్తు, అదే ప్రాంగణంలోని పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాల్లో ఖాళీ గదులను జిల్లా పరిషత్ పాలనకు వినియోగించుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా పరిషత్‌కు సీఈఓ, డిప్యూటీ సీఈఓలను కూడా ప్రభుత్వం నేడు నియమించే అవకాశాలు ఉన్నాయి.
క్షేత్ర స్థాయి ప్రక్రియ పూర్తి
గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ దాదాపు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితా ప్రచురణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు తదితర కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశారు. అలాగే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ తదితర వివరాలను కూడా ఉన్నతాధికారులకు పంపారు.
సేవల్లో చోటు చేసుకోనున్న జాప్యం
మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడం వల్ల ప్రజలకు అందించాల్సిన సేవల్లో జాప్యం చోటు చేసు కునే అవకాశాలు అధికంగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకాధికారులు తమ శాఖకు సంబంధించిన విధులు నిర్వహిస్తూనే, అదనంగా మండ ల పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉండటమే అందు కు కారణమవుతోంది. మండలాల్లోని అనేక గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి పనులు(రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పాఠశాల భవనాలు) చేపట్టే విషయంలో పాలకవర్గాలు లేకపోవడం వల్ల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రత్యేకాధికారు ల నిర్ణయం మీద ఆధారపడాల్సి వస్తుంది. పైగా తమ పరిధిలోని గ్రామాల్లో ఏ సమస్య ఉందో ప్రజాప్రతినిధులకు తెలుసు. ప్రత్యేకాధికారులు స్థానిక సమస్యల పై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకాధికారులకు చెక్ పవర్ ఉన్నా, ప్రతి పనికి జిల్లా కలెక్టర్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.
26న ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా
కర్నూలు(సెంట్రల్): నైపుణ్యం, ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 26న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆల్ డిక్సాన్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంస్థలు ఇంటర్వ్యూలతో 350 ఖాళీలను భర్తీ చేసుకోనున్నట్లు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికి రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు జీతభత్యాలు ఉంటాయన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు యువతీ, యువకులు అర్హులన్నారు. వివరాలకు www.ncs.gov.in, https://www.employment. ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
కూటమి నేతలదే పెత్తనం
మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులు
నూతనంగా ఏర్పాటవుతున్న నంద్యాల జిల్లా పరిషత్ పాలనకు సంబంధించి అవసరమైన ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తు తం ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ నుంచి పరిపాలనాధికారుల వరకు మొత్తం 96 మంది ఉద్యోగులు ఉండగా, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు 10 ఖాళీగా ఉన్నా యి. మిగిలిన 86 మంది ఉద్యోగులు వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని కేడర్ వారీగా నంద్యాల జెడ్పీకి పంపేందుకు జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓలు నివేదికలను సిద్ధం చేశారు. కలెక్టర్ ఆమోదం లభించిన వెంటనే వారిని నంద్యాలకు పంపనున్నారు. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న వారిని రెండు జిల్లాలకు సమానంగా కేటాయించేందుకు చర్యలు తీసుకున్నారు.


