పారదర్శకంగా సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా సేవలు అందించాలి

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

● జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

కొలిమిగుండ్ల: ప్రజా ప్రతినిధుల పరిపాలన ముగియడంతో అధికారులు పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాయలంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్షతన చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ముందుగా తమ ప్రగతి నివేదికలను సభలో చదివి వినిపించారు. చివరి సమావేశం కావడంతో సభ్యులు హుందాగా సభను నడిపించారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. మండలంలో కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని కొత్తగా బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఐదేళ్ల పాటు అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి దిశగా నడిపించామన్నా రు. గ్రామాల్లో ఎన్నో శాశ్వత పనులు చేపట్టగలిగామని గుర్తు చేశారు. ఎంపీటీసీల సభ్యుల పదవీ కాలం ముగియడంతో జెడ్పీచైర్మన్‌ సభ్యులను సన్మానించారు. అలాగే గురువారంతో జెడ్పీచైర్మన్‌ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులతో పాటు వివిధ శాఖల అధికారులు ఆయన్ను ఘనంగా సన్మానించి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దస్తగిరిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ విశ్వతేజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement