నంద్యాల(అర్బన్): నాలుగు రోజులుగా జిల్లా లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వర్షాలు కురిశాయి. బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 19.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అదే విధంగా బనగానపల్లె మండలంలో 17.8 మి. మీ, పగిడ్యాలలో 12.4, కోవెలకుంట్ల 9.6, జూపాడుబంగ్లా 6.6, నంద్యాల రూరల్ 6.2, అవుకు, దొర్నిపాడు 5.6, చాగలమర్రి 5.0, డోన్ 4.6, రుద్రవరం 4.2, ప్యాపిలి 2.8, శ్రీశైలం 2.4, ఉయ్యాలవాడ 2.0, పాములపా డు, సంజామల 1.6, ఆత్మకూరు, శిరివెళ్ల 1.4, కొలిమిగుండ్ల 1, నందికొట్కూరులో 0.8, వెలుగోడు 0.4 మి.మీ వర్షం కురిసింది.
వామ్మో.. రక్త పింజరి
మహానంది: మహానంది దేవస్థానంలో ని డొనేషన్ కౌంటర్ వద్ద ఆరు అడుగుల రక్తపింజరి పాము కనిపించడంతో స్థానిక సిబ్బందితో పాటు భక్తులు భయాందోళనకు గురయ్యారు. డొనేష న్ కౌంటర్ దగ్గరి నుంచి దక్షిణ గాలిగోపురం ద్వారా పెద్దకోనేరు ప్రాంతంలోకి వెళ్లింది. దీంతో అక్కడే ఉన్న భక్తులు భయాందోళన కు గురయ్యారు. గుర్తించిన సిబ్బంది ఆలయ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డికి సమాచారం అందించడంతో వెంటనే ఆయన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించాడు. మోహన్ ఆలయంలోకి చేరుకుని ఆరు అడు గుల పొడవున్న రక్తపింజరి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అట వీ ప్రాంతంలో వదిలేశాడు.
ఉచిత కృత్రిమ అవయవాలకు నమోదు చేసుకోవాలి
కర్నూలు కల్చరల్: శ్రీసత్యసాయి సేవా సమితి, భారత్ వికాస్ పరిషత్ కర్నూలు శాఖ సహకారంతో నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ ఉచితంగా ఇస్తున్నట్లు సంస్థల ప్రతినిధులు బీవీ బాలసుబ్రహ్మణ్యం, అశోక్ కుమార్ సందీప్ కుమార్ తెలిపారు. అవసరమున్న వారు అక్టోబర్ 3వ తేదీలోగా 9440441447, 9989974333, 8519884070 నంబర్ల్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నెహ్రూనగర్‌లోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో నిపుణులచే పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
మొండికేసిన 13 మంది మద్యం లైసెన్స్‌దారులు
కర్నూలు: జిల్లాలో మద్యం దుకాణాల అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం రాత్రితో ముగిసింది. 106 మద్యం దుకాణాల్లో 93 మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా రుసుములు చెల్లించి ప్రక్రియను పూర్తి చేసుకుని పునరుద్ధరించుకున్నారు. మరో 13 మంది తమ దుకాణాలను రెన్యూవల్ చేసుకునేందుకు మొండికేశారు. కర్నూలులో 2, కోడుమూరులో 1, ఎమ్మిగనూరులో 3, ఆదోనిలో 1, పత్తికొండలో 2, కోసిగిలో 3, ఆలూరులో 1 దుకాణాదారు రెన్యువల్‌కు ముందుకు రాకపోవడంతో వాటికి గెజిట్ విడుదల ద్వారా కలెక్టర్ అనుమతితో గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ.3 లక్షల రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
డీ–ఫార్మాలో స్పాట్ అడ్మిషన్లు
కర్నూలు సిటీ: ఎస్.జి పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ డిప్లమా ఇన్ ఫార్మసీ(డీ–ఫార్మా) కోర్సులలో ఖాళీ సీట్లు స్పాట్ అడ్మిషన్స్‌తో భర్తీ చేయనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 21నే స్పాట్ అడ్మిషన్స్ జరిగాయని, అయితే ఆసక్తి ఉన్న విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు ఈ నెల 28న స్పాట్ అడ్మిషన్‌కు అవకాశం ఇచ్చారన్నారు. పూర్తి వివరాలకు 9494138227, 986627340 2 నెంబర్లను సంప్రదించాలన్నారు.


