● జిల్లా జడ్జి వాసు
కర్నూలు(అర్బన్): నల్సా (పిల్లల స్నేహ పూర్వక న్యాయ సేవలు) పథకం 2024 ద్వారా 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి బాల బాలికలకు ఉచిత సురక్షితమైన సులభమైన న్యాయ సహాయాన్ని అందిస్తామని 6వ అదనపు జిల్లా జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ వాసు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అంతర్జాతీయ బధిరుల దినోత్సవం సందర్భంగా నల్సా పిల్లల కోసం స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీ వాసు మాట్లాడుతూ.. విద్యా హక్కు, హెల్ప్ లైన్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181, న్యాయ సహాయం కోసం హెల్ప్‌లైన్ 15100, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, దివ్యాంగుల హెల్ప్‌లైన్ 14456 తదితర అంశాల గురించి తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ.. వినికిడి లోపం ఉన్న బధిరుల భావ ప్రకటన స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడటం, సాంకేతిక భాషకు సహజమైన పూర్తి స్థాయి ప్రామాణిక భాషగా గుర్తించాలన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్, ఐసీడీఎస్ పీడీ పీ విజయ, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచా లకులు రయిస్‌ఫాతిమా పాల్గొన్నారు.


