కౌతాళం: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ అప్పన్న ఆచార్యులు (83) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. కౌతాళంకు చెందిన ఈయన 40 సంవత్సరాల పాటు తిరుమలలో మంత్రాలయం దాస సాహిత్య ప్రాజెక్టులో సేవలందించారు. హరే శ్రీనివాస అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరి నోట పలికేలా చేశారు. హరిదాస సాహిత్యాన్ని ప్రతి ఊరు, జిల్లా దేశ నలుమూలలకు చేర్చిన ఘనత ఈయనది. ఈయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి, కౌతాళం సింగల్ విండో అధ్యక్షుడు వెంకటపతిరాజు, ఉరుకుంద మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ చెన్నబసప్ప పలువురు సంతాపం తెలిపారు. ఎమ్మిగనూరు బీజేపీ నాయకులు గురురాజరావు, ప్రహ్లాదచారి తదితరులు సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


