రంగాపురంలో యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

రంగాపురంలో యువకుడి హత్య

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

బేతంచెర్ల: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన గంప ఎల్ల రమేష్‌ (24)ను కుటుంబీకులే దారుణంగా హత్య చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎల్ల రమేష్‌ మద్యానికి బానిసై ఇంట్లో తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసేవాడు. బుధవారం మద్యం తాగి వచ్చిన రమేష్‌ తండ్రి లింగన్నను, అన్న శివ నారాయణతో ఘర్షణ పడి దాడి చేశాడు. అతని వేధింపులు తాళలేక తండ్రి, అన్న ఇద్దరూ కలిసి గురువారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో తాడుతో రమేష్‌ గొంతుకు బిగించి హత్య చేశారని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్నత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement