జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం ఎన్నో తప్పులు చేసింది. ఫలితంగా తొమ్మిదో గేటు రోప్ తెగిపోయిందనే విమర్శలున్నాయి. వాస్తవానికి ప్రతి ఏటా పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా నిలిచిన వెంటనే గేట్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ ఏడాదిలో మార్చి 17న పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా నిలిచిపోయింది. అయితే గేట్ల మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గేట్లకు రబ్బర్‌సీల్స్ అమర్చకుండా, రోప్‌లను సరిచేయకుండా, పనికిరాని వాటిని మార్చకుండా అలాగే ఉండిపోయారు. ప్లంబర్‌బ్లాక్‌లను, ఫుట్‌రాక్‌ను కనీసం పరిశీలించలేదు. ఫలితంగా రోప్‌లు, రోప్‌రోలర్లు, బేరింగ్స్, ప్లంబర్‌బ్లాక్‌లు తుప్పుపట్టిపోయాయి. హెడ్‌రెగ్యులేటర్ పది గేట్ల ఉండగా నాలుగు ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేమన్న దుస్థితికి చేరాయి.
హడావుడిగా నూతన రోప్!
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను అపరేట్ చేసే పరిజ్ఞానం పర్యవేక్షణాధికారుల్లో లేకపోవటంతో ఎన్‌సీఎల్ సిబ్బంది సాయం తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పోతిరెడ్డిపాడునుంచి నీటిని విడుదల చేశారు. గేట్లు మొరాయించకుండా అప్పుటికప్పుడు రోప్‌లకు గ్రీస్ పూయించారు. గేట్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఈనెల 10న తొమ్మిదో గేటు తెగింది. తెగిన రోప్ స్థానంలో హడావుడిగా నూతన రోప్‌ను అమర్చారు. గేట్లపైన రంధ్రాలు పడిన ఫుట్‌రాక్‌కు తాత్కాలికంగా వెల్డింగ్ పనులు చేసి చేతులుదులుపుకొన్నారు. విరిగిన మూడో వగేటు ప్లంబర్‌బ్లాక్‌కు మరమ్మతులు చేయించలేదు. ఈ విషయమై పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డిని వివరణ కోరగా.. విరిగిన ప్లంబర్‌బ్లాక్‌కు రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు చేయిస్తామన్నారు. మిగిలిన పనులను ఒకదాని తర్వాత ఒకటి త్వరలో పూర్తిచేయిస్తామని పేర్కొన్నారు.
నత్తనడకన హెడ్‌రెగ్యులేటర్
మరమ్మతులు
విరిగిన మూడో గేటు ప్లంబర్‌బ్లాక్
తుప్పుపడుతున్న రోప్‌రోలర్లు,
ప్లంబర్‌బ్లాక్‌లు, రోప్‌లు


