మహానంది: నందీశ్వర అభిషేకం కోసం రూ. 40లక్షలతో మండప నిర్మాణానికి గుంటూరుకు చెందిన రవీంద్ర, లక్ష్మీ అపర్ణ దంపతులు సహకారం అందిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానంది క్షేత్రంలో నంది సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రాతి నంది విగ్రహ దాత రవీంద్రను కలిసేందుకు గుంటూరు వెళ్లినట్లు చెప్పారు. ప్రతి నెలా, రెండు నెలలకు ఒకసారి వచ్చే బహుళ త్రయోదశి రోజు నందీశ్వరస్వామికి ప్రదోషకాల అభిషేకం చేస్తున్నామన్నారు. అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటికి వెళ్లే మార్గం లేక ఇబ్బందిగా ఉందన్నారు. నంది చుట్టూ భక్తులు నిలబడి పూజలు చేసేందుకు వీలుగా మండపం నిర్మించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీంతో స్పందించిన దాత రవీంద్ర, లక్ష్మీ అపర్ణ దంపతులు సుమారు రూ. 40లక్షలు వెచ్చించి నిర్మిస్తామని చెప్పారన్నారు. ఈ సందర్భంగా వారికి మహానందీశ్వరస్వామి మెమొంటో అందించినట్లు చెప్పారు.


