కర్నూలు: జ్యుడీషియల్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన నంద్యాల జ్యుడీషియల్ ఎంప్లాయీస్ క్రికెట్ జట్టు సభ్యులు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జ్యుడీషియల్ ఉద్యోగులకు జిల్లాస్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో నంద్యాల జ్యుడీషియల్ టీమ్ కెప్టెన్ జి.మురళికృష్ణ, జట్టు సభ్యులు గిరిధర్, శీత్యా నాయక్, నరేష్, తాజ రాలి, శివ, గోపాల్, పృథ్వీరాజ్, రాహుల్, దేవేంద్ర, ఖలీల్, ప్రశాంత్ తదితరులు శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా జడ్జి చేతుల మీదుగా ప్రథమ బహుమతిని అందుకున్నారు.


