నేడు నీలకంఠుడి మహా రథోత్సవం
ఎమ్మిగనూరుటౌన్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను మేళతాళాలతో పూర్ణకుంభంతో తేరుబజారులోని రథశాల వద్దకు తీసుకురానున్నారు. హోమం, విశిష్ట పూజలు చేసిన అనంతరం మహారథంపై ఉత్సవమూర్తిని అధిష్టింపజేసి ఉత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త నీలమురళీధర్ ఆధ్వర్యంలో మహారథానికి ఆదివారం తుదిమెరుగులు దిద్దారు. శనివారం రాత్రే పార్వతీపరమేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తిశ్రద్ధలతో ఆదివారం రాత్రి 9 నుంచి 12గంటల వరకు ప్రభావళి మహోత్సవాన్ని నిర్వహించారు.
నేడు నీలకంఠుడి మహా రథోత్సవం


