మొక్కజొన్న పంట దగ్ధం
బనగానపల్లె: మండలంలోని యాగంటిపల్లె గ్రా మంలో గురువారం సాయంత్రం సోమన్నగారి రామకృష్ణారెడ్డికి చెందిన మొక్కజొన్న పంట నూ ర్పిడి దశలో ఉండగా ప్రమాదవశాత్తూ మూడు ఎకరాల్లోని పంట దగ్ధమైందని రైతు వాపోయాడు. పంట పొలాని కి కొంత దూరంలో ఎగిసిన మంటలు సుడిగాలి వల్ల మొక్కజొన్న పంటపై నిప్పులుపడ్డాయి. దీంతో మంటలు పంట మొత్తం వ్యాపించాగా బనగానపల్లెలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా.. నాలుగు ఎకరాల్లో పంట సాగు చేయగా.. మూడు ఎకరాల్లోని పంట కాలిపోయింది.


