మిర్యాలగూడ అర్బన్ : మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థల్లో శుక్రవారం యాంటీ డ్రగ్స్ డాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టింది. శ్రీగోపాల్శ్రీ అనే జాగిలంతో పాటు పోలీసు సిబ్బంది సైదులు, ఎంఏ రషీద్ కళాశాలలోని ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థుల వద్ద డ్రగ్స్ ఆనవాళ్లను పసిగట్టేందుకు తనిఖీలు నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు కళాశాల ప్రాంగణమంతా డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది. అయితే కళాశాలల్లో ఎక్కడా డ్రగ్స్ ఆనవాళ్లు లభించకపోవడంతో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


