హాలియా (నాగార్జునసాగర్) : మిర్యాలగూడ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు శుక్రవారం సాగర్ బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించి బుద్ధవనం విశేషాలకు సంబంధించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన మహాస్థూపంలోని ధ్యానమందిరంలో విద్యార్థుల చేత ధ్యానం చేయించారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశిష్టతను వివరించారు. విద్యార్థులకు బుద్ధవనం ప్రవేశ రుసుంలో 50శాతం రాయితీ కల్పించడం హర్షనీయమని విద్యాలయం ప్రిన్సిపాల్ రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవి, దివ్యకాంత్, సతీష్, మోబిన్, షిఖా, అనూష పాల్గొన్నారు.


