డిసెంబర్‌లో పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు డిసెంబర్‌ 15 నుంచి పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

నల్లగొండ : రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు కోరారు. నల్లగొండలో టీఎన్‌జీవోస్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన డీలర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాకు రూ.300 కమిషన్‌ ఇవ్వడంతో పాటు రేషన్‌ సరుకుల దిగుమతి ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం రేషన్‌ డీలర్ల జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాచుపల్లి మునీందర్‌రావు, ప్రదాన కార్యదర్శిగా వైద్యుల సత్యనారాయణను ప్రకటించారు.

హరిత హోటల్‌ నిర్మాణానికి భూ సేకరణ

నల్లగొండ (కనగల్‌) : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్‌ నిర్మాణానికి భూసేకరణ చేపట్టారు. శుక్రవారం నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి దర్వేశిపురంలో పర్యటించారు. హరిత హోటల్‌ నిర్మాణానికి గుడి వద్ద సర్వే నంబర్‌ 120 ఐదు ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పద్మ, ఆలయ చైర్మన్‌ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సర్పంచ్‌ రాయల శేఖర్‌, ఆర్‌ఐ డి.సునీత, జూనియర్‌ అసిస్టెంట్‌ అస్లామ్‌ పాల్గొన్నారు.

నేడు జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌

మిర్యాలగూడ టౌన్‌ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్‌ కళాశాలలో శనివారం జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక (జేవీవీ) జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు 30 ఏళ్లుగా జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండల స్థాయిలో వివిధ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌కు ఎంపికవుతారని తెలిపారు. సమావేశంలో జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఫెల్‌, చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ జిల్లా కన్వీనర్‌ వద్దిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సభ్యులు కోలా శ్రీనివాస్‌, మధుసూదన్‌, ఉస్మాన్‌ అలీ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement