జనగణనలో అందరూ పాల్గొనాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

జనగణనలో అందరూ పాల్గొనాలి : ఎస్పీ

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

నల్లగొండ : జనగణన – 2027లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన ఎన్యుమరేటర్ల వద్ద వివరాలను నమోదు చేయించుకుని మాట్లాడారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక ఆధారమని, భవిష్యత్‌ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జనగణన పేరుతో మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు ఆధార్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం వివరాలు, ఓటీపీలు అడగరని తెలిపారు. అలాంటి వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ఉస్మాన్‌, మల్లిక్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement