పెంచిన ధరలు తగ్గించాలి.. | - | Sakshi
Sakshi News home page

పెంచిన ధరలు తగ్గించాలి..

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

పెంచిన ధరలు తగ్గించాలి.. ధరల పెంపు సరికాదు..

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి. ఈ పెంపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. నేను ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నా. బండి మీద వెళ్లాలి. వచ్చిన జీతంలో అధిక శాతం పెట్రోల్‌కే ఖర్చయితే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలి.

– మాదవి, ప్రైవేట్‌ ఉద్యోగి, నల్లగొండ

ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత ఽపెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. ఇప్పటికే ధరలు పెరిగి వ్యాపారాలు లేవు, కుటుంబం గడవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. దాంతో మళ్లీ ధరలు పెరుగుతాయి. దీనివల్ల వ్యాపారంలో నష్టపోతాం. ప్రభుత్వం ధరలు తగ్గించాలి.

– ముర్తూజా, పండ్ల వ్యాపారి, నల్లగొండ

Advertisement
 
Advertisement
Advertisement