మా బతుకు బస్టాండే..
ఫ లీటర్ పెట్రోల్‌పై రూ.3.40,
డీజిల్‌పై రూ.3.27 పెంపు
ఫ నిరసన తెలిపిన రాజకీయ పక్షాలు
నల్లగొండ : సామాన్యుడిపై పెట్రో బాంబు పేలింది. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెరుగుదల, కొరతతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు మూతపడుతున్న తరుణంలో.. తాజా పెంపు ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ తయారైంది.
రూ.3 పైనే పెంపు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సాకుతో కేంద్రం ఇంధన ధరలను సవరించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.40, డీజిల్‌పై లీటరుకు రూ.3.27 పెంచింది. డీ జిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై నేరుగా పడనుంది. ఫలితంగా నిత్యావసరాలైన బియ్యం, ప ప్పులు, నూనె ధరలు పెరగనున్నాయి. కూరగాయలు, రవాణా ఖర్చులు పెరగడంతో సా మాన్యుడిపై భారం పడనుంది. స్టీల్, సిమెంట్ ధరలు పెరిగి సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం కానుంది.
జిల్లాపై ప్రభావం
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 240 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిత్యం వేల లీటర్ల ఇంధన విక్రయాలు జరిగే ఈ జిల్లాలో, తాజా పెంపు వల్ల ప్రజలపై ప్రతి నెలా కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో, మధ్యతరగతి జీవి బడ్జెట్ తలకిందులవుతోంది.
వెల్లువెత్తుతున్న
నిరసనలు
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసన సెగలు మొదలయ్యాయి. నల్లగొండ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ పెట్రో ధరల పెంపుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫ్రీ బస్‌తో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. నల్లగొండ నుంచి చర్లపల్లి, ఎస్‌ఎల్‌బీసీ, పానగల్ వెళ్లేవారు కూడా బస్‌లు ఎక్కుతున్నారు. వృద్ధులు, నడవలేని వారు మాత్రమే ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ దరలు పెంచింది. దీంతో మా బతుకులు బస్టాండ్ పాలు కానున్నాయి. – గాలయ్య, ఆటో డ్రైవర్, నల్లగొండ


