ఎంజీయూలో ఏఐపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఎంజీయూలో ఏఐపై అవగాహన

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

నల్లగొండ టూటౌన్‌ : విద్యా వారోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ఆర్ట్స్‌ బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ‘ఆర్టిఫిపియల్‌ ఇంటెలిజెన్స్‌ పర్‌ ఎవ్‌రి వన్‌’ అనే అంశంపై హైదరాబాద్‌కు చెందిన ఏఐ నిపుణుడు డాక్టర్‌ కళ్యాణ్‌ సర్వేపల్లి.. ప్రొపెసర్లకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత, మిషన్‌ లెర్నింగ్‌.. విద్యా రంగంలో, ఇంజనీరింగ్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు జరుగుతాయని, విద్యార్థులు వీటిని గమనించి లోతైన అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ అంజిరెడ్డి ప్రిన్సిపాల్‌ ఆర్‌.రేఖ, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ వై.ప్రశాంతి, ప్రొఫెసర్లు హరీష్‌కుమార్‌, జయంతి, సంధ్యారాణి, సుధారాణి, అధాపకులు పాల్గొన్నారు.

వర్షపు నీటిని సంరక్షించాలి

కనగల్‌ : వర్షపు నీటిని సంరక్షించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి కోరారు. జల సంచాయ్‌ – జన్‌ భాగిదారి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనగల్‌ గ్రామంలో ఆయన నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆవ వేదరక్షిత, ఎంపీఓ సతీష్‌కుమార్‌, సర్పంచ్‌ నర్సింగ్‌ మురళిగౌడ్‌, ఉప సర్పంచ్‌ చంద్రయ్య, ఏపీఓ సుధాకర్‌, కార్యదర్శి వీరబాబు, మాజీ సర్పంచ్‌ చిట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ఇక్కత్‌’ను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం

భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్‌ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని మిస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌, తెలంగాణ ఇక్కత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌ అన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 79వ కేన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్బంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఆమె ఫ్యారీస్‌కు బయలుదేరి వెళ్తూ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలతో రెడ్‌ కార్పెట్‌పై నడవబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, మగ్గంపై ఎంతో శ్రమకోర్చి కళాత్మక ఇక్కత్‌ వస్త్రాలను రూపొందించిన పోచంపల్లి నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement