కొండమల్లేపల్లి : ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొండమల్లేపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పంట వేశాక యూరియా ఇవ్వకుండా, ఇప్పుడు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్


