ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రభుత్వం ప్రాధామ్య పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా పెండింగ్‌ ఉన్న కేంద్రాలను సందర్శించి కారణాలను విశ్లేషించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు నూటికి నూరు శాతం గ్రౌండింగ్‌ చేయాలని, గ్రౌండింగ్‌ కాని వాటిని రద్దుచేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఎల్‌–3 నుంచి ఎల్‌–1కు వచ్చే కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, బదిలీల్లో ఎలాంటి సమస్యలకు అవకాశం ఇవ్వకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement