
నకిరేకల్‌లో మాట్లాడుతున్న విజయ్‌సింగ్ మీనన్
దేవరకొండ, డిండి, నకిరేకల్: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఆర్.కన్నన్, పోలీస్ పరిశీలకుడు వినీత్‌కన్నా ఆదేశించారు. సాధారణ పరిశీలకుడు ఆర్.కన్నన్ సోమవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియతోపాటు డిండి, డిండి మండలంలోని చెర్కుపల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలీస్ పరిశీలకుడు వినీత్ కన్నా దేవరకొండలో స్ట్రాంగ్ రూమ్‌లతోపాటు డిండి మండలం వావిల్‌కోల్ గ్రామ పరిధిలోని ఎర్రగుంటపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట డిండి తహసీల్దార్ ఎన్.తిర్పతయ్య, డీటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్‌ఐలు గోపరాజు, శ్యామ్‌నాయక్, సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులున్నారు. అలాగే మరో పోలీస్ పరిశీలకుడు విజయ్‌సింగ్ మీనన్ సోమవారం నకిరేకల్‌లోని ఆర్‌ఓ కార్యాలయం, చెక్ పోస్ట్‌లను సందర్శించారు. ఆయన వెంట సీఐలు రాఘవరావు, రాజశేఖర్, ఎస్‌ఐలు సుధీర్, గోపికృష్ణ ఉన్నారు.