ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Oct 27 2023 2:06 AM | Updated on Oct 27 2023 10:01 AM

- - Sakshi

నల్గొండ జిల్లా : పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదని ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం మోటకొండూర్‌ మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో జరిగింది. ఎస్‌ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిరెడ్డిగూడేనికి చెందిన గుర్రాల సోములు(40), అతడి భార్య సుజాత మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుజాత నెల క్రితం తన కుమార్తె, కుమారుడిని భర్త వద్ద వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపంతో సోములు గురువారం తన వ్యవసాయ క్షేత్రం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క పొలాల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి గుర్రాల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎప్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement