ఐపీఎస్‌ ట్రైనింగ్‌ పూర్తి.. తెలంగాణ క్యాడర్‌కు చైతన్యరెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ ట్రైనింగ్‌ పూర్తి.. తెలంగాణ క్యాడర్‌కు చైతన్యరెడ్డి

Oct 27 2023 2:06 AM | Updated on Oct 27 2023 11:37 AM

- - Sakshi

నూతనకల్‌: నూతనకల్‌ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క చైతన్యరెడ్డి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు. బొక్క సంజీవరెడ్డి–వినోద దంపతుల కుమార్తె చైతన్యరెడ్డి 2022లో ప్రకటించిన యూపీఎస్సీ పరీక్షలో 161ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికై న విషయం విదితమే.

హైదరాబాద్‌లో ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నారు. తండ్రి జిల్లా కోఆపరేటివ్‌ ఆఫీసర్‌గా వరంగల్‌లో పనిచేస్తుండడంతో అక్కడే స్థిరపడ్డారు. చైతన్యరెడ్డి వరంగల్‌లోని ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధులు నిర్తహిస్తూనే సివిల్స్‌ వైపు దృష్టిసారించారు.

ఆరు సార్లు ప్రయత్నించి విఫలమైనా పట్టువదల కుండా ఆత్మవిశ్వాసంతో ఏడో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యం సాధించారు.సొంత రాష్ట్రం క్యాడర్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చైతన్యరెడ్డి అన్నారు. స్వరాష్ట్ర ప్రజలకు సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement