గోకులంలో పెళ్లి | - | Sakshi
Sakshi News home page

గోకులంలో పెళ్లి

Nov 29 2026 3:05 PM | Updated on Nov 29 2026 3:05 PM

భువనగిరి : ‘గో సంరక్షణ, గో సంతతి పెంపుపై అవగాహన కల్పించాలనే మా కుమార్తె వివాహం గోవుల సాక్షిగా వ్యవసాయ క్షేత్రంలో చేశాం. ఇందు కోసం వరుడి కుటుంబ సభ్యులను సైతం ఒప్పించాం. గోశాల వద్ద పెళ్లి జరిపించడమేమిటి అన్న వారే.. ఇక్కడి వచ్చి ప్రకృతిలో పెళ్లి వేడుక చూసి పరవశించిపోయారు’ అని భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన రైతు, గో సేవకుడు తుమ్మల సత్తిరెడ్డి చెప్పారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో మట్టి పాత్రల్లో వంటలు చేశామని వివరించారు. ప్రకృతి రమణీయత మధ్య జరిగిన ఆయన కుమార్తె వివాహ విశేషాలను, గోవుల పోషణ పట్ల ఆయనకున్న ప్రేమను ‘సాక్షి’కి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement