సదర్‌ సంబరం | - | Sakshi
Sakshi News home page

సదర్‌ సంబరం

Nov 29 2026 3:05 PM | Updated on Nov 29 2026 3:05 PM

గోవుల సాక్షిగా సంప్రదాయ పద్ధతిలో..

1వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌..

మిర్యాలగూడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన సదర్‌ సమ్మేళనానికి హాజరైన జనం

నల్లగొండ : విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఉమ్మడి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో నల్లగొండలోని డైట్‌ కళాశాలలో రెండు రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొననున్నారు. మూడు ప్రధాన విభాగాలతోపాటు ఉపాధ్యాయుల బోధనా అభ్యసన సామగ్రి ప్రదర్శన, విద్యార్థులకు ప్రత్యేక సెమినార్లు నిర్వహించనున్నారు.

140 ప్రాజెక్టులతో ప్రతిభాపాటవాలు..

ఈ ఏడాది పీఎం శ్రీ పాఠశాలల నుంచి 43 ప్రాజెక్టులు ప్రదర్శనకు రానున్నాయి. ఇన్‌స్పైర్‌ మనక్‌ (2025–26) కింద రాష్ట్రస్థాయిలో ఎంపికై న 97 ప్రాజెక్టులకు జిల్లా స్థాయిలో ప్రదర్శనకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాజెక్టులను విద్యార్థులు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. మరోవైపు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కింద ఏడు టీమ్‌లు పాల్గొననున్నాయి. ఈ విభాగానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికై న విద్యార్థులు కూడా డిసెంబర్‌ 4, 5 తేదీల్లో తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు.

ఏడు అంశాలపై ప్రాజెక్టులు..

రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు శ్రీసుస్థిర, వికసిత్‌ భారతం కోసం విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణలుశ్రీ ప్రధాన ఇతివృత్తంగా నిర్ణయించారు. ఇందులో కృత్రిమ మేధస్సు, హరిత శక్తి, పర్యావరణ పరిరక్షణ, గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, దేశీయ వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ పరివర్తన, విపత్తు నిర్వహణ వంటి ఏడు ఉప అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించనున్నారు. జూనియర్‌ విభాగంలో 6, 7, 8 తరగతులు, సీనియర్‌ విభాగంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు ఒక విద్యార్థి మాత్రమే అనుమతిస్తారు. సొంతంగా రూపొందించిన వినూత్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఉపాధ్యాయులకూ అవకాశం..

ప్రదర్శనలో భాగంగా ఉపాధ్యాయులు, బీఈడీ, డీఈడీ శిక్షణార్థులు నూతన బోధనా అభ్యసన సామగ్రి (టీఎల్‌ఎం)ను ప్రదర్శించవచ్చు. ఆసక్తి ఉన్నవారు జిల్లా సైన్స్‌ అధికారికి వాట్సప్‌ ద్వారా వివరాలు పంపించాలి. విద్యార్థులకు ‘వాతావరణ చర్య కోసం ఎస్‌టీఈఎం’, ‘అంటువ్యాధులు కాని వ్యాధులు–కారణాలు, నివారణ చర్యలు’ అనే అంశాలపై ఒకరోజు సెమినార్‌ నిర్వహించనున్నారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, చార్టుల ద్వారా పేపర్లు సమర్పించాలనుకునే విద్యార్థులు ప్రదర్శన వేదిక వద్ద పేర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు తెలిపారు.

నాకు చిన్నప్పటి నుంచే గోవులు అంటే ఇష్టం. అప్పట్లోనే మా కుటుంబానికి 26 ఆవులు ఉండేవి. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు పోయి యాంత్రిక వ్యవసాయ విధానం వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో.. గో ఆధారిత వ్యవసాయంతోనే రైతులకు ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ఉంటుందనే ఆలోచన వచ్చింది. గ్రామంలోని మా వ్యవసాయ భూమిలో మూడు ఆవులతో గోశాలను ప్రారంభించాను. ప్రస్తుతం 300 ఆవులు ఉన్నాయి. వీటికి పశుగ్రాసంతోపాటు కంది, పెసర, ఉల్వల పిట్టు పెడతాం. ఇప్పటి వరకు వైద్యులు లేకుండా గో పోషణ చేస్తున్నాం. గోవుల నుంచి వచ్చే పాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. కొన్ని పాలతో నెయ్యి తయారు చేసి ఉపయోగించుకుంటాం. నేను ఏర్పాటు చేసుకున్న గోశాలను స్పూర్తిగా తీసుకుని మా బంధువులు, రైతులు కూడా గోశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

చాలా మిస్‌ అయ్యే వాళ్లం..

ఆంద్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన బంధువులు, మిత్రలు, తన కుమార్తె స్నేహితులు ఐఐటీ బెంగుళూరు నుంచి వచ్చిన వారు సైతం ఈ వివాహం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహానికి రాకపోతే చాలా మిస్‌ అయ్యేవాళ్లం అని చాలా మంది నాతో చెప్పారు.

కుమార్తె వివాహం గోశాల వద్ద ఎలా చేస్తారని కొంత మంది ప్రశ్నించారు. చాలా మంది మాత్రం బాగుంటుందని ప్రోత్సహించారు. దీంతో ఈ నెల 22న ఫామ్‌హౌస్‌లో ఇంటి ఎదుట పచ్చని పందిరి వేసి గోశాల వద్ద కుమార్తె వివాహన్ని సంప్రదాయ బద్దంగా మూడు రోజుల వేడుకగా నిరాడంబరంగా నిర్వహించాం. పూర్వ వైభవాన్ని చాటి చేప్పేలా వరుడికి కానుకగా 7 గోవులను ఇచ్చాను. ఆ రోజు చాలా వివాహాలు ఉన్నప్పటికీ.. గోశాల వద్ద నిర్వహించే వివాహాన్ని చూసేందుకు బంధుమిత్రులతో పాటు రైతు కుటంబాలకు చెందిన వారు అధికంగా వచ్చారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో వంటలు చేశాం. వంటల కోసం మట్టి పాత్రలను ఉపయోగించాం. కట్టెలపొయ్యిల పైనే వంటలు చేయించాం. గానుగ, కుసుమ నూనె మాత్రమే వాడాం. మా గోశాలలోని ఆవు పెరుగు, నెయ్యిని వడ్డించాం.

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్‌ పాటిల్‌

డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఫ నల్లగొండలోని డైట్‌ కళాశాలలో నిర్వహణ

ఫ ప్రదర్శనకు మొత్తం 140 ప్రాజెక్టులు

ఫ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు, సృజనాత్మకత పెంపే లక్ష్యం

బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనాలనుకునే విద్యార్థులు డిసెంబర్‌ 1లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ముందుగా నమోదు చేసుకున్న ప్రాజెక్టులకే ప్రదర్శనలో అవకాశం కల్పించనున్నారు. ఇన్‌స్పైర్‌ మనక్‌ కింద ఎంపికై న 97 మంది విద్యార్థులకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని, వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని ప్రధానోపాధ్యాయులు, గైడ్‌ టీచర్లకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement