రోడ్డు ప్రమాదాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

Nov 30 2026 12:11 AM | Updated on Nov 30 2026 12:11 AM

సాక్షి యాదాద్రి : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన రోడ్డు భద్రతా కమిటీ, యాంటీ నార్కోటిక్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ, ఇతర ప్రధాన రహదారులు కలిసే చోట స్పీడ్‌ బ్రేకర్లు, హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారి సునీల్‌ కుమార్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తుక్యా నాయక్‌, డీఈఓ భిక్షపతి, జిల్లా ట్రానన్స్‌పోర్ట్‌ అధికారి నరేష్‌, డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

వీధి కుక్కలను నియంత్రించాలి

వీధి కుక్కలను నియంత్రించి వాటి బారినుంచి ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేయడం అవసరమన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనాథ్‌, ఏడీ రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement