మళ్లీ ఉద్యమ బాటేనా?
గిరి ప్రదక్షిణ మార్గంలో కుంగిన రోడ్డు
● చౌటుప్పల్ మండలం తంగడపల్లి రెవెన్యూ పరిధిలో
80.11 ఎకరాలు.
● సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురంలో 9.30 ఎకరాలు, కోతులాపురంలో 22.22, చిమిర్యాలలో 25.12, సర్వేల్లో 139.29, కంకణాలగూడెంలో 25.23, పుట్టపాకలో 84.20 ఎకరాలు.
● గట్టుప్పల్ మండలంలో గట్టుప్పల్‌లో 83.35 ఎకరాలు, తేరట్‌పల్లిలో 83.13,
వెల్మకన్నెలో 1.37 ఎకరాలు.
● చింతపల్లి మండలం కుర్మపల్లిలో 93.06 ఎకరాలు, మల్లేపల్లిలో 43.13, వింజమూర్లో 80.08, కుర్మేడులో 1.37 ఎకరాలు.
● మర్రిగూడ మండలం వట్టిపల్లిలో 107.07 ఎకరాలు, బట్లపల్లిలో 2.23, దామరభీమనపల్లిలో 93.01, మర్రిగూడలో 48.31,
మేటిచందాపూర్లో 78.28, నామాపూర్‌లో 80.21, సరంపేట గ్రామంలో
21.11 ఎకరాలు.
చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)విస్తరణలో మరో మైలురాయి పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకర కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా తాజాగా దక్షిణ భాగానికి సైతం బీజం పడింది. దక్షిణ భాగం ఉమ్మడి జిల్లాకు సంబంధించి నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా వెళ్తుంది. నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, మునుగోడు, మర్రిగూడ, చింతపల్లి మండలాల పరిధిలో 33.16 కిలోమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో 15.66 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. అయితే చౌటుప్పల్ పట్టణంలోని జంక్షన్ ప్రాంతం నుంచి మొదలయ్యే దక్షిణ భాగానికి మండలంలోని తంగడపల్లి, నారాయణపురం మండలంలో చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, కంకణాలగూడెం, కోతులాపురం, పుట్టపాక, సర్వేల్ గ్రామాల పరిధిలో 387.30ఎకరాల భూమిని సేకరించనున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు మండలంలోని వెల్మకన్నె, గట్టుప్పల్ మండలంలోని తేరట్పల్లి, గట్టుప్పల్, చింతపల్లి మండలంలోని కుర్మేడు, కుర్మపల్లి, మల్లేపల్లి, వింజమూరు, మర్రిగూడ మండలంలోని బట్లపల్లి, దామెరభీమనపల్లి, మర్రిగూడ, సరంపేట, మేటిచందాపూర్, నామాపూర్, వట్టిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో 818.36ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1,205ఎకరాల భూమి సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
భూ సేకరణ అధికారులుగా ఆర్డీఓలు
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ నోటిఫికేషన్లు శనివారం ఆయా జిల్లాల్లో విడుదల అయ్యాయి. ఇందుకుగాను చౌటుప్పల్, చండూరు, దేవరకొండ ఆర్డీఓలను భూసేకరణ అఽధికారులుగా నియమించారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారంగా ప్రక్రియ వేగంగా జరిపించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
గతంలో రైతుల నుంచి అభ్యంతరాలు..
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ, అలైన్మెంట్ అంశాలపై చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలకు చెందిన రైతులు గతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు కంపెనీ ప్రయోజనాల కోసం రహదారి అలైన్‌మెంట్‌ను మార్చారనే ఆరోపణలతో తమ భూములు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట కూడా ధర్నాలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి. తమ భూములను కాపాడాలంటూ రైతులు అప్పట్లో ఉద్యమబాట పట్టారు.
కుమార్తె వివాహం గోశాల వద్ద ఎలా చేస్తారని కొంత మంది ప్రశ్నించారు. చాలా మంది మాత్రం బాగుంటుందని ప్రోత్సహించారు. దీంతో ఈ నెల 22న ఫామ్‌హౌస్‌లో ఇంటి ఎదుట పచ్చని పందిరి వేసి గోశాల వద్ద కుమార్తె వివాహన్ని సంప్రదాయ బద్దంగా మూడు రోజుల వేడుకగా నిరాడంబరంగా నిర్వహించాం. పూర్వ వైభవాన్ని చాటి చేప్పేలా వరుడికి కానుకగా 7 గోవులను ఇచ్చాను. ఆ రోజు చాలా వివాహాలు ఉన్నప్పటికీ.. గోశాల వద్ద నిర్వహించే వివాహాన్ని చూసేందుకు బంధుమిత్రులతో పాటు రైతు కుటంబాలకు చెందిన వారు అధికంగా వచ్చారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో వంటలు చేశాం. వంటల కోసం మట్టి పాత్రలను ఉపయోగించాం. కట్టెలపొయ్యిల పైనే వంటలు చేయించాం. గానుగ, కుసుమ నూనె మాత్రమే వాడాం. మా గోశాలలోని ఆవు పెరుగు, నెయ్యిని వడ్డించాం.
నాకు చిన్నప్పటి నుంచే గోవులు అంటే ఇష్టం. అప్పట్లోనే మా కుటుంబానికి 26 ఆవులు ఉండేవి. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు పోయి యాంత్రిక వ్యవసాయ విధానం వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో.. గో ఆధారిత వ్యవసాయంతోనే రైతులకు ఆనందం ఆరోగ్యం, ఆదాయం ఉంటుందనే ఆలోచన వచ్చింది. గ్రామంలోని మా వ్యవసాయ భూమిలో మూడు ఆవులతో గోశాలను ప్రారంభించాను. ప్రస్తుతం 300 ఆవులు ఉన్నాయి. వీటికి పశుగ్రాసంతోపాటు కంది, పెసర, ఉల్వల పిట్టు పెడతాం. ఇప్పటి వరకు వైద్యులు లేకుండా గో పోషణ చేయబడుతుంది. గోవుల నుంచి వచ్చే పాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. కొన్ని పాలతో నెయ్యి తయారు చేసి ఉపయోగించుకుంటాం. నేను ఏర్పాటు చేసుకున్న గోశాలను స్పూర్తిగా తీసుకుని మా బంధువులు, రైతులు కూడా గోశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
చాలా మిస్ అయ్యే వాళ్లం..
ఆంద్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన బంధువులు, మిత్రలు, తన కుమార్తె స్నేహితులు ఐఐటీ బెంగుళూరు నుంచి వచ్చిన వారు సైతం ఈ వివాహం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహానికి రాకపోతే చాలా మిస్ అయ్యేవాళ్లం అని చాలా మంది నాతో చెప్పారు.
2న జిల్లాకు కరువు బృందం
గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిన ప్రాంతాల్లో తాజాగా భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో మరోసారి రైతులు ఎలా స్పందిస్తారోనన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్ ప్రకారం భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వ నిర్ణయానికి సహకరిస్తారా? లేక గతంలో మాదిరిగానే తమ భూముల పరిరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధమవుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఫ 22 రెవెన్యూ గ్రామాల్లో 1,205 ఎకరాల భూసేకరణ
ఫ నల్లగొండ జిల్లా పరిధిలో 33.16 కిలోమీటర్ల రోడ్డు
ఫ యాదాద్రి జిల్లాలో 15.66 కిలోమీటర్లు..


