డిసెంబర్‌ 4 నుంచి వైజ్ఞానిక సంబురం | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 4 నుంచి వైజ్ఞానిక సంబురం

Nov 30 2026 12:11 AM | Updated on Nov 30 2026 12:11 AM

బాలల వైజ్ఞానిక ప్రదర్శన

భువనగిరి : విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో శాసీ్త్రయ ఆలోచనలు, పరిశోధనా దృక్పథాన్ని పెంచి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జిల్లా విద్యా శాఖ వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్‌ స్పైర్‌)కు సిద్ధమైంది. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో వలిగొండ మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్‌ 4 ఉదయం 10గంటల నుంచి 5 విభాగాలకు సంబంధించిన మొత్తం 385 ఎగ్జిబిట్స్‌ను ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు. దీంతో పాటు 30మంది సెమినార్‌ నిర్వహించనున్నారు. 2రోజుల పాటు భోజన వసతి కల్పించనున్నారు. కార్యక్రమం నిర్వహణకు ఇప్పటికే 24 కమిటీలు ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 4న టీఎఫ్‌ఐసీ, సామాజిక శాస్త్రాలు, 5న మిగతా ప్రాజెక్టుల ప్రదర్శనలతో ఈ ప్రదర్శన ముగియనుంది.

ఈ ఏడాది సామాజిక శాస్త్రం ఎగ్జిబిట్లు

సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది నుంచి సోషల్‌ సైన్సెస్‌ విభాగంలో జిల్లా స్థాయిలో ఏడు అంశాలపై ప్రదర్శనలకు ఆసక్తి ఉన్నవారి నుంచి ఆహ్వానించారు. దీంతో 75 మంది సామాజిక శాస్త్రం అంశాలకు సంబంధించిన ఎగ్జిబిట్లను ప్రదర్శించేందుకు ముందుకొచ్చారు.

గత ఇన్‌స్పైర్‌ మానక్‌ విద్యార్థులకు..

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులకు జిల్లా నుంచి 72 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటిని కూడా ఇదే వేదికపై ప్రదర్శించనున్నారు.

టీఎఫ్‌ఐసీ నుంచి 30 ప్రాజెక్టులు

తెలంగాణ ఇన్నోవేషన్‌ ఫ్యూచర్‌ ఛాలెంజ్‌(టీఎఫ్‌ఐసీ) కింద ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రాజెక్టులను ఆహ్వానించారు. 30 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

22 పీఎంశ్రీ పాఠశాలల నుంచి..

ప్రధాన మంత్రి స్కూల్స్‌ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకం అమలయ్యే ఉన్నత పాఠశాలలు వారు ప్రత్యేకంగా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. జిల్లాలో మొత్తం 22 పాఠశాలలు ఉండగా ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో గైడ్‌ ద్వారా కనీసం ఒక్కటి.. గరిష్టంగా రెండు ప్రాజెక్టులతో కలిపి మొత్తం 32 ప్రాజెక్టులను తయారు చేస్తున్నారు. కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు డీఈఓ భిక్షపతి, జిల్లా సైన్స్‌ అధికారి రాజశేఖర్‌ తెలిపారు.

ఫ వలిగొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో

రెండు రోజుల పాటు నిర్వహణ

ఫ ఈ సారి 385 ఎగ్జిబిట్లకు అవకాశం

ఫ ఏర్పాట్లు చేస్తున్న విద్యా శాఖ

2026–27 సంవత్సరానికి జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో గతేడాది 210 ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచగా ఈ సారి 176కుపైగా ఉంచనున్నారు. సుస్థిర వికసిత్‌ భారత్‌ కోసం శాస్త్ర సాంకేతికత అనే ప్రధానాంశం మరో ఏడు ఉప అంశాలపై 6 నుంచి 8, అలాగే 9 నుంచి 12 జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో అన్ని పాఠశాలల విద్యార్థులు పోటీపడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement