పోలీస్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని ఐజీ షహనాజ్ ఖాసీం సూచించారు.
- 8లో
శ్రీలక్ష్మీనృసింహులకు
సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ముఖమండపంలోని బంగారు ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం శాస్త్రోక్తంగా సువర్ణ పుష్పార్చన చేపట్టారు. వేకువజామునే శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేసి, తులసీ దళాలతో శ్రీస్వామికి సహస్ర నామార్చన, వేదమంత్రాలతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించి, సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధిలో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించారు.


