బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో.. బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ మహిళలు ఆడిపాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు అచ్చంపేట పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయం, ఐలవ్ అచ్చంపేట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు అంబర్నాంటాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే వేడుకల్లో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలకు బొడ్డెమ్మ ఆడారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి – సరితారెడ్డి, డా.చిక్కుడు వంశీకృష్ణ – అనురాధ దంపతులు పాల్గొన్నారు. అచ్చంపేటలో మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వివిధ కుల, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది తీరొక్క పూలతో బతుకమ్మలను తయారుచేసి ఆడిపాడారు. – నాగర్కర్నూల్/అచ్చంపేట


