కందనూలు: సమాజంలో చెడును పారద్రోలి, ప్రజలకు రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు చెందిన ఆయుధాలతో పాటు వాహనాలకు ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయదశమి సందర్భంగా పోలీస్ శాఖ ఆయుధ పూజ నిర్వహించడం గొప్ప సంప్రదాయమని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.


