వర్షానికి దెబ్బతిన్న పంటలు | - | Sakshi
Sakshi News home page

వర్షానికి దెబ్బతిన్న పంటలు

Oct 19 2026 1:13 AM | Updated on Oct 19 2026 1:13 AM

పెద్దకొత్తపల్లిలో నేలకొరిగిన వరిపైరు, తాడూరు మండలం అల్లాపూర్‌లో దెబ్బతిన్న పత్తిపంట

పెద్దకొత్తపల్లి/తాడూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కురిసిన వర్షంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తిపంటలు దెబ్బతిన్నాయి. పెద్దకొత్తపల్లిలో అవ్వగారి కృష్ణయ్య, లక్ష్మయ్యకు చెందిన దాదాపు 12 ఎకరాల వరిపైరు కంకి దశలో ఉండగా.. పూర్తిగా నేలకొరిగింది. గింజలు పట్టకుండా తాలుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే తాడూరు మండల కేంద్రంతో పాటు అల్లాపూర్‌ తదితర గ్రామాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక దిగుబడి పూర్తిగా తగ్గిందని రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షంతో ఉన్న పత్తి కాయలు కిందపడ్డాయని వాపోతున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement