కాళ్లగజ్జెల జోరు | - | Sakshi
Sakshi News home page

కాళ్లగజ్జెల జోరు

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

జానపదాల హోరు..

బతుకమ్మ ఆడుతున్న మహిళా పోలీసు సిబ్బంది

కందనూలు/ అచ్చంపేట రూరల్‌: తీరొక్క పూలతో చూడముచ్చటైన బతుకమ్మలు.. జానపద గేయాల హోరుకు అనుగుణంగా కాళ్లగజ్జెల సవ్వడి తోడై బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూల పండుగ బతుకమ్మ వేడుకలను శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో, ఎస్పీ కార్యాలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని.. చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా.. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన.. అంటూ బతుకమ్మ ఆడారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ‘బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అన్నారు. అలాగే అచ్చంపేట సివిల్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జడ్జి స్పందన గౌరమ్మ పూజ చేసి ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు.

సైబర్‌ నేరాలపై బతుకమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement