● కొండారెడ్డిపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదివారం ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 8 అభివృద్ధి పనులను వారు ప్రారంభిస్తారని చెప్పారు.
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని స్వగ్రామానికి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఇందుకోసం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పీహెచ్సీ, భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం, సోలార్ వీధి లైట్లు, శంకుస్థాపన చేయనున్న ఏటీసీ సెంటర్ను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని హంగులతో ముస్తాబు చేయాలన్నారు. ముఖ్యమంత్రి దర్శనం చేసుకునే ఆలయం, జమ్మిచెట్టు వద్ద పూలతోరణాలు, అలంకరణ, విద్యుద్దీకరణ చేయాల న్నారు. రెప్పపాటులో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడవద్దని ఇందుకు సంబంధించి చర్య లు తీసుకోవాలని అవసరమైతే జమ్మిచెట్టు వద్ద జనరేటర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు చెప్పారు. గతంలో మాదిరిగానే పోలీసు బందోబస్తు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, అ చ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా, సర్పంచ్ వెంకటయ్య, ఉపసర్పంచ్ వేమారెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు వెంకట్రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన
ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి


