చెంచులందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చెంచులందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

బల్మూర్‌: నల్లమలలోని చెంచు గూడేల్లో ప్రతి కుటుంబానికి వీబీజీ రాంజీ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాది పొడవునా పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని వీబీజీ రాంజీ సంయుక్త కమిషనర్‌ శేషుకుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి ఆకస్మికంగా వచ్చి మండలంలోని గుడిబండ, బిళ్లకల్‌ గ్రామాల్లో చెంచు ఆవాసాలను సందర్శించారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న చెంచు కూలీలతో మాట్లాడి పనుల తీరును పరిశీలించారు. చెంచులకు వెంటనే జాబ్‌ కార్డులు మంజూరు చేయాలని, ఒక్క కూలీ కూడా మిస్‌ కాకుండా అందరూ పనులకు హాజరయ్యేలా చూడాలని ఎంపీడీఓను ఆదేశించారు. చెంచు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి వీబీజీ రాంజీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రేవత్‌రెడ్డి, ఏపీఓ భాస్కర్‌, మల్లేష్‌, ఈసీ స్వామి, ఏపీఎం సైదులు, పీఏ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement