పెద్దకొత్తపల్లి: మాజీ మంత్రి దివంగత పుట్టపాగ మహేంద్రనాథ్ జీవిత చరిత్ర అందరికీ ఆదర్శప్రాయమని మహేంద్రనాథ్ తనయుడు, కర్ణాటక మాజీ డీజీపీ పుట్టపాగ రవీంద్రనాథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జొన్నలబొగుడలో మాజీమంత్రి మహేంద్రనాథ్ జన్మ శతాబ్ది సంచికను విద్యార్థి పీవీ కౌశిక్ చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి మహేంద్రనాథ్ గాంధేయ మార్గంలో నడిచి తమకు కూడా అదే మార్గంలో పయనించాలని సూచించారన్నారు. బడుగు, బలహీన వర్గాల పట్ల ఎంతో ప్రేమతో వారి అభ్యన్నతికి కృషి చేశారని కొనియాడారు. అలాగే వక్తలు సర్పంచ్ ధర్మేందర్, ఐక్యత సమాజ ప్రతినిధులు నర్సింహ, రాఘవులు, నిరంజన్‌రెడ్డి, రాజారావు, బాలరాజు, సాంబశివ తదితరులు మాట్లాడారు. పుస్తకావిష్కరణ అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


