నీటినీడలు..! | - | Sakshi
Sakshi News home page

నీటినీడలు..!

Oct 3 2026 1:50 AM | Updated on Oct 3 2026 1:50 AM

జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన చేపపిల్లల పెంపకం

జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన చేపపిల్లల పెంపకం

● వర్షాభావ పరిస్థితులతో 75 శాతం నిండని చెరువులు

● ఈసారి 284

చెరువుల్లోనే

చేపపిల్లలు పెంచాలని నిర్ణయం

● గతేడాదితో పోలిస్తే 20 శాతమే దిగుబడి

రానుందని అంచనా

● మత్స్యకార్మికుల జీవనోపాధిపై

ఎల్‌నినో పడగ

–8లో u

నాగర్‌కర్నూల్‌: రైతన్నలపైనే కాదు.. మత్స్యకారుల జీవనోపాధిపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువుల్లోకి నీరు రాకపోవడంతో చేపపిల్లల పెంపకం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఇప్పటికే చేపపిల్లలను చెరువుల్లో వదలిపెట్టగా.. ఈసారి ఇంకా వదల్లేదు. అయితే మరో వారం రోజుల్లో వదలడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో 1,256 చెరువులు ఉండగా వాటిలో కేవలం 284 చెరువుల్లోనే పెంచాలని మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఐదు రిజర్వాయర్లు, 28 పెద్ద చెరువులు, 251 ఇతర కుంటలు, చెరువుల్లోనే చేప పిల్లలు వదలనున్నారు. మి గతా చెరువులు నీరు లేక వెలవెలబోతుండటంతో పెంపకానికి నిరాకరించారు. ఏటా చేపల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.

వదలనున్న చేపవిత్తనాలు 1.43 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement