అమ్మ కష్టంతో ఎంబీబీఎస్‌.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ కష్టంతో ఎంబీబీఎస్‌..

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

కందనూలు: నేను పదో తరగతి వరకు నాగర్‌కర్నూల్‌లోని ఎంజేపీ గురుకులంలో, ఇంటర్మీడియట్‌ వికారాబాద్‌ సీఓఈ గురుకులంలో చదివాను. ఆ తర్వాత అక్కడే నీట్‌ కోచింగ్‌ తీసుకుని ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నా. నేను డాక్టర్‌ కావడానికి మా అమ్మ లక్ష్మి స్ఫూర్తి. మా నాన్న మల్లేష్‌ 2016లో మరణించాడు. అప్పటి నుంచి నన్ను మా చెల్లి, తమ్ముడిని కూలి పనిచేస్తూ మా అమ్మ చదివించింది. మా అమ్మ పడుతున్న కష్టాలను చూసి ఎలాగైనా ఉన్నత చదువులు చదివి మా కుటుంబానికి అండగా ఉండాలని కష్టపడి చదివి ఎంబీబీఎస్‌ సీటు సాధించాను. నాకు ఎంబీబీఎస్‌ సీటు రావడానికి ప్రోత్సహించిన మా గురువులకు, మా అమ్మకు రుణపడి ఉంటాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement