ఈ ఏడాదిలో పనులు ప్రారంభించినప్పటి నుంచి ఉపాధి పనికి వెళ్తున్నాం. కానీ, ఇప్పటి వరకు రూ.2,500 మాత్రమే వచ్చాయి. ఇంకా ఐదు వారాలకు సంబంధించిన డబ్బులు రాలేదు. కనీసం 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రోజు ఎంత కూలి పడుతుందో కూడా తెలియడం లేదు. – లక్ష్మమ్మ, మర్రిపల్లి,
ఉప్పునుంతల మండలం
పకడ్బందీగా చేపడుతాం..
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హా మీ కింద పనులు నిర్వహిస్తున్నాం. పను లు సక్రమంగా చేపట్టేలా, వేతనాలు వచ్చేందుకు వీలుగా నిబంధనలు పాటించేలా చూస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. పేమెంట్స్ వచ్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం.
– చిన్న ఓబులేషు, డీఆర్‌డీఓ
●


