పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

Jun 16 2026 1:22 AM | Updated on Jun 16 2026 1:22 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్‌లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్‌లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్‌లో 44.09, ఐదో సెమిస్టర్‌లో 66.97, ఆరో సెమిస్టర్‌లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement