జిల్లాలో ఘనంగా పునఃప్రారంభమైన విద్యాసంస్థలు
కందనూలు/ అచ్చంపేట రూరల్/ వెల్దండ: జిల్లావ్యాప్తంగా సోమవారం విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులను ఆకట్టుకునేలా ఉపాధ్యాయులు పాఠశాలలను మామిడితోరణాలు, బెలూన్లతో ముస్తాబు చేసి.. విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పుస్తకాలు, నోట్‌బుక్స్ విద్యార్థులకు అందజేశారు.
42 వేల మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా 749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా. ఇందులో సుమారు 42 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మొదటిరోజు జిల్లాలో 9,450 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకునే సమయంలో టీచర్లు, ప్రజాప్రతినిధులు గేటు నుంచి విద్యార్థులకు పూలు చల్లుతూ.. వారి వెంబడి నడుస్తూ తరగతి గదిలోకి తీసుకెళ్లి వారిని కూర్చోబెట్టారు. తొలిరోజు ఆటపాటలతో ఆనందపరుస్తూ.. విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు.
అచ్చంపేట మండలం చౌటపల్లి పాఠశాలలో కూలిన తరగతి గది
మామిడితోరణాలు, బెలూన్స్‌తో పాఠశాలల ముస్తాబు
విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేసిన ప్రజాప్రతినిధులు
మొదటిరోజు అంతంతమాత్రంగానే విద్యార్థుల హాజరు


