విద్యార్థుల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంచాలి

Jun 16 2026 1:22 AM | Updated on Jun 16 2026 1:22 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన వెల్దండలోని ఎమ్మార్సీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఆవరణలో ఉన్న సరస్వతిదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌బుక్స్‌ అందజేశారు. డీఈఓ వెంట ఎంఈఓ చంద్రుడు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement