త్వరలోనే ప్రారంభిస్తాం..
ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.
– వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్
కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్‌లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు.
వ్యూ పాయింట్ ఇదే..
సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు
కృష్ణానది, నల్లమల అందాలు తిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం
ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి
రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు
అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి


