కొల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన కోసం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి నిరంజన్‌రెడ్డితోపాటు నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, వాటన్నింటికీ ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పదేపదే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నష్టం జరి గిందని మంత్రి జూపల్లి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అందులో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటున్నారని, గత ప్రభు త్వాల పాలనలో ఆయన పాత్ర కూడా ఉందనేది గుర్తించుకోవాలన్నారు. నేను ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా చే శా.. మెడికల్, ఫిషరీస్ కాలేజీలు తీసుకువచ్చా. జిల్లా రూపురేఖలు మార్చా. ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన మీరు కొల్లాపూర్‌ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనను గతంలో జూపల్లి ప్రశంసిస్తూ మాట్లాడిన వీడియోలను ఆయన సమావేశంలో ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రజలు సీఎంలను ఎన్నికల్లో ఓడ గొడుతున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అదే జరిగింది. రేపు కొడంగల్ కూడా అదే జరగొ చ్చు. రేవంత్‌రెడ్డి ఓడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడు తూ నియోజకవర్గంలో అధికార పార్టీ వేధింపులు పరాకాష్టకు చేరాయని, ఇక సహించేది లేదన్నారు. అక్రమ కేసులు, వేధింపులు, భూకబ్జాలపై పోరా టాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి అల్లీపూర్ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, నరే ందర్‌రెడ్డి, న్యాయవాది రవికుమార్, జంబులయ్య, బండల వెంకటస్వామి, రాంచందర్‌యాదవ్, సురేందర్‌రావు, గోపాల్‌యాదవ్, శంకర్‌నాయక్, సాయిరాంయాదవ్, జగదీష్‌రెడ్డి, భాస్కర్‌రావు, నిరంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడొద్దు : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి


