జనరల్‌ ఆస్పత్రిలో భారీగా బదిలీలు | - | Sakshi
Sakshi News home page

జనరల్‌ ఆస్పత్రిలో భారీగా బదిలీలు

Jun 10 2026 12:43 AM | Updated on Jun 10 2026 12:43 AM

పాలమూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్‌ఓడీలు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్‌ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్‌ఓడీ హన్మంతు ప్రసాద్‌ గాంధీ ఆస్పత్రి, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్‌ శ్రీకాంత్‌ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్‌) హెచ్‌ఓడీ డాక్టర్‌ సురేష్‌ శ్రీనివాస్‌ నిలోఫర్‌, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ అమరావతి ఉస్మానియా, ఎస్‌పీఎం హెచ్‌ఓడీ డాక్టర్‌ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ రమాదేవి నిలోఫర్‌కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్‌ ఆస్పత్రిలోని గైనిక్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్‌ మెడిసిన్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్వప్న ఉస్మానియాకు, జనరల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాల శ్రీనివాస్‌ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్‌పీఎం హెచ్‌ఓడీగా డాక్టర్‌ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్‌ శ్రీవాణి, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీగా డాక్టర్‌ శకుంతల రావడం జరిగింది.

కొత్తవారు ఎప్పుడో..?

జిల్లా జనరల్‌ ఆస్పత్రితోపాటు మెడికల్‌ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్‌ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు.

డీఎంహెచ్‌ఓ కృష్ణ బదిలీ

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్‌ఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కృష్ణ నాగర్‌కర్నూల్‌ డీఎంహెచ్‌ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్‌ సునీతరెడ్డి వికారాబాద్‌ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి (డీఐఓ)గా డాక్టర్‌ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్‌లు, 24 మంది ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్‌ఓలు, నలుగురు హెల్త్‌ ఎడ్యుకేటర్లు, సూపర్‌వైజర్లు, సీనియర్‌ అసిస్టెంట్స్‌, జూనియర్‌ అసిస్టెంట్స్‌, సీహెచ్‌ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, మెడికల్‌ కళాశాల, జనరల్‌ ఆస్పత్రిలో పోస్టింగ్‌ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు.

లింగాల: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. మంగళవారం లింగాల మండల కేంద్రంలో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించి.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఫోన్‌ ద్వారా ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అదే విధంగా బుద్ధవనం, ఓపెన్‌ జీమ్‌ వినియోగంలోకి తీసుకురావాలని సర్పంచ్‌కు తెలియజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.

● ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా లింగాలకు మంజూరైన రెండు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వయం సహాయక మహిళా సంఘాలకు అందజేశారు. మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే కాకుండా.. వ్యాపార వేత్తలుగా, బస్సుల యజమానులుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్‌, ఎంపీడీఓ చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణగౌడు, సర్పంచ్‌ పూజారి ఈశ్వరమ్మ, బుడ్డయ్య, ఇందిరమ్మ పాల్గొన్నారు.

9 విభాగాల హెచ్‌ఓడీలు, అసోసియేట్‌లకు స్థానచలనం

డీఎంహెచ్‌ఓ కృష్ణ నాగర్‌కర్నూల్‌కు..

ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్‌ఎంలు అందరూ బదిలీ

జనరల్‌ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement