ఫిట్‌నెస్‌ లేని బస్సులపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ లేని బస్సులపై చర్య తీసుకోవాలి

Jun 9 2026 8:58 AM | Updated on Jun 9 2026 8:58 AM

కందనూలు: జిల్లాలో ఫిట్‌నెస్‌ లేని ప్రైవేటు స్కూల్‌ బస్సులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ శాంతన్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌, పర్మిషన్‌ లేని బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారన్నారు. అలాంటి బస్సులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంగనమోని బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్‌కుమార్‌, నగర సంయుక్త కార్యదర్శి శివ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement