1969 నుంచి.. | - | Sakshi
Sakshi News home page

1969 నుంచి..

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఎన్నో పోరాటాకు నాగర్‌కర్నూల్‌ వేదికగా నిలిచింది. 1969 నాటి ఉద్యమం నుంచి 1997లో జరిగిన ప్రజాస్వామిక తెలంగాణ పోరాటం, 2001 నుంచి జరిగిన మలిదశ ఉద్యమాల్లో ఈ ప్రాంత ప్రజలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నడిపించిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని.. రాష్ట్ర ఏర్పాటయ్యే దాక మడమ తిప్పకుండా పోరాడారు. రోడ్ల దిగ్బంధం వంటి సంఘటనలెన్నో పోరాటంలో మైలురాళ్లుగా నిలిచాయి. తెలంగాణ కోసం పలువురు ఆత్మబలిదానాలు చేయగా.. విప్లవోద్యమంలోనూ ఎంతో మంది బలయ్యారు.

అందరి ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర అవిర్బావించి నేటికి 12ఏళ్ల పూర్తవుతోంది. ఈపన్నెండుల్లో జిల్లాలో జరిగిన అభివృద్ది నామమాత్రగానే ఉంది. ప్రధానంగా సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగడానికి పారిశ్రమిక ప్రగతి జరగలేదు. రావాణా సౌకర్యాలు మెరుగుపడ లేదు. విద్యారంగంలో మెడికల్‌ కాలేజీ తప్ప మరే ఇతర కాలేజీలు ఏర్పాటు కాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement