ప్రజల భద్రతకు ప్రాధాన్యం.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతకు ప్రాధాన్యం..

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

ప్రజల భద్రతకు ప్రాధాన్యం..

రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సిగ్నల్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల భద్రత, సౌకర్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. రాబోయే రోజుల్లో మరిన్ని ముఖ్య కూడళ్ల వద్ద కూడా ట్రాఫిక్‌ సమస్య లేకుండా మరిన్ని సదుపాయాలు ఏర్పాటుచేస్తామన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అనుసరిస్తూ ప్రయాణించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, వైస్‌చైర్మన్‌ బాదం రమేశ్‌, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, ఎస్‌ఐలు గోవర్ధన్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement