అచ్చంపేట: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 10న నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవిష్యత్తు మార్చబోయే ఈ బహిరంగ సభ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు అమర్ నాధ్, సోలాంకి శ్రీనివాస్ నాయక్, మంగ్యానాయక్, రేణయ్య తదితరులు ఉన్నారు.


