ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

అచ్చంపేట రూరల్‌: ఆయిల్‌పాం సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్‌ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయిల్‌పాం సాగుతో కలిగే లాభాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కృషి ధన్‌ ధన్య యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతులు లాభసాటి పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్‌, సిద్దప్ప, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement